top of page

VEDAS ASSOCIATION: Global Solutions

Specialized Consulting

Search

"పుస్తకావిష్కరణ మరియు కులగణన పై సమావేశము"

సహజ కవి బ్రహ్మశ్రీ శ్రీమంతుల వీరబ్రహ్మం గారిచే విరచితమైన శతక కావ్యము "జీవన సత్యాలు" పుస్తకావిష్కరణ కార్యక్రమం తేది 27.10.2024 రోజున ఉదయం 11గం.ల నుండి జరిగింది. గురుతుల్యులు బ్రహ్మశ్రీ పద్మశ్రీ కూరెళ్ళ విఠలాచార్యగారి చేతుల మీదుగా వారు స్థాపించిన "కూరెళ్ళ మహా గ్రంథాలయము" ఆవరణలో వేదాస్ అసోషియేషన్ ( VEDAS ASSOCIATION TG) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర Executive Council Meetingలో ఆవిష్కరణ కార్యక్రమము జరిగింది. ఈ సమావేశానికి వివిధ వర్గాల నుంచి విశ్వకర్మలు వందకు పైగా హాజరైనారు. సమావేశ స్థలము యెల్లంకి గ్రా., రామన్నపేట. భువనగిరి జిల్లా. తదుపరి ఈ కార్యక్రమంలో రాబోయే కులగణన సందర్భంలో మన పంచదాయిలు ఒకే పేరుతో తమ కులం పేరు నమోదు చేసుకొనుటకు చర్చించనైనది. దానివల్ల మన సామాజిక బలం ఇతరులకు తెలియజేసిన వారమవుతాము. లేదంటే గత పదేళ్ళలాగా, ఇప్పటిలాగానే మన సమాజం భవిష్యత్ లో కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది. అనేక కష్ఠనష్ఠాలకు గురయ్యే అవకాశం ఉన్నది. సంఘాలు ఎవరికి వారే, తామే అందరికి ప్రతినిధులం అనుకొని తమకు తోచిన నిర్ణయాలు చేసి ప్రకటించుటవలన అనవసర కన్ఫ్యూజన్ కు దారి తీస్తున్నది. అలా కాకుండా ఐక్యంగా మన సమాజానికి తెలియజేసి నమ్మకం కలిగించవలసిన అవసరం ఉన్నదని గ్రహించిన సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరైనారు. గౌరవ గవర్నర్ గారు ప్రారంభించిన పద్మశ్రీ బిరుదాంకితులు కూరెళ్ళవారి గ్రంథాలయంలో జరిగిన మొట్టమొదటి సమావేశంలో ఒక చరిత్రాత్మక ఐక్య నిర్ణయానికి రావడము జరిగింది.

ఈ సర్వే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, మరియు కులం గురించి ప్రశ్నలు ప్రత్యేక ఫార్మాట్ లో ఉంటాయి. కావున కులం గురించి ప్రశ్నలు అడిగినపుడు *దేశవ్యాప్తంగా ఐక్యం అవుతున్న విస్తృతమైన పేరు విశ్వకర్మ అని ,* కులానికి ఉన్న ఇతర పేర్లు అడిగినపుడు విశ్వబ్రాహ్మణ అని తెలుపగలరని నిర్ణయమైనది. కావున ఇదేవిధంగా సర్వే కొరకు వచ్చేవారితో తెలుపగలరని సమస్త విశ్వకర్మ సమాజన్ని కోరుతూ వేదాస్ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. మీ వృత్తి అడిగినపుడు మీరు మీ కుటుంబం తరతరాలుగా చేసిన లేదా చేస్తున్న వృత్తి పేరు కమ్మరి లేదా వడ్రంగి లేదా కంచరి లేదా స్వర్ణకార(అవునుల) లేదా శిల్పి అని స్పష్ఠంగా తెలుపండి. మొహమాటానికి పోయి ఆర్భాటానికి పోయి తప్పు చెప్పకండి. మన గోత్రం మన ప్రాచీన వృత్తిని సూచిస్తుంది. మనం ప్రస్థుతం చేస్తున్న పనిని అడిగితే ఇప్పుడు చేసే పని చెప్పండి. ప్రభుత్వం మన జనాభాను బట్టి మన వృత్తిని బట్టి తగిన ప్రణాళికలు చేసి మన వృత్తులకు, కులానికి సహాయం అందించే అవకాశం ఉన్నది.

మీరు,

మీకుటుంబ సభ్యులు అందరి ఆధార్, రేషన్ కార్డు, ధరణి పాస్ బుక్స్ , ఇతర సర్టిఫికేట్లతో సిధ్ధంగా ఉండగలరు.

అందరికీ నమస్కారాలు🙏.

అభినందనలతో🌷

జై విశ్వకర్మ...

జైజై విశ్వకర్మ...

మీ

VEDAS ASSOCIATION TG

Rgrd No.333/2017.

 
 
 

Recent Posts

See All

Comments


bottom of page